బంగారం కోసం షాపులకెళ్లొద్దు..ఈ ఏటిఎంలో తీస్కోండి



గోల్డ్‌సిక్కా లిమిటెడ్‌ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గోల్డ్ ఏటీఎం రెండో వెర్షన్‌ను మెషీన్ ఓపెన్  చేసింది. ఇక్కడ మీకు లైవ్ రేటులో బంగారం కాయిన్లు కానీ..సిల్వర్ కాయిన్లు కానీ తీసుకోవచ్చు. షాపుల్లో మాత్రమే ఇవి కొనే అవకాశం ఉండగా..ఇలా ఏటిఎంలలో కూడా డ్రా చేయగలగడం ప్రస్తుతం  ఓ వెరైటీ కాన్సెప్ట్.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్ మెట్రో స్టేషన్ కావటంతో ఈ గోల్డ్ ఏటీఎం జనాల ఆదరణ చూరగొంటోంది. అలానే కొనేవాళ్లకంటే

చూసేవాళ్లే ఎక్కువనడంలో సందేహమే లేదు



ఈ అమీర్ పేట మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం ద్వారా 0.5 నుంచి 20 గ్రాముల వరకు బంగారం కొనుక్కోవ్చు.  10 నుంచి 100 గ్రాముల వరకు సిల్వర్ కాయిన్లూ తీసుకోవచ్చు. ATM LBMA నుంచి లైవ్ రేట్లను కూడా క్యాప్చర్ చేస్తుంది. గొప్ప విషయం ఏమిటంటే..డెబిట్ తోపాటు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా తీసుకోగలగడం ఎందుకంటే కొన్ని షాపుల్లో ఈ క్రెడిట్ కార్డులను యాక్సెప్ట్ చేయడం లేదు. 


ఇలాంటి ఏటిఎం గతంలోనూ సిటీలో ఉండగా..ఇది రెండోది..అంతేకాకుండా కొత్త ఫీచర్లున్నాయని చెప్తున్నారు.

Comments