మార్కెట్లు కేక..ఉత్తరదిశగా జైత్రయాత్ర , సెక్టార్ రొటేషన్ క్లియర్

 ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు కే


క పుట్టిస్తున్నాయ్. ఈ రోజు నిఫ్టీ

140 పాయింట్ల వరకూ పెరిగింది. అలానే సెన్సెక్స్ మరో నూతన

గరిష్టానికి 71193 పాయింట్ల దగ్గర చేరుకుంది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం వరకూలాభపడగా, ఐటిఇండెక్స్ ఒకటిన్నరశాతం

వరకూలాభపడగా, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ కూడా

అదరగొడుతోంది. టెక్నాలజీ,ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా 

పార్టీలో జాయినవగా పిఎస్ఈ సెక్టార్ కూడా ఓ హ్యాండ్ వేసింది. వెరసి మన

మార్కెట్లు బిగ్గెస్ట్ గెయినర్ ఆఫ్ ది వరల్డ్‌గా  ఈ 2023లో నిలవడం ఖాయమైపోయింది


ఓఎన్‌జిసి, టాటాకన్జ్యూమర్ ప్రొడక్ట్స్, విప్రో, హీరోమోటోకార్ప్, ఎల్టీఐ మైండ్‌ట్రీ

ఒకటిన్నర నుంచి నాలుగున్నర శాతం వరకూ దంచికొట్టేశాయ్. వీటిలో కనీసం

మూడు స్టాక్స్ 52వీక్స్ హై క్రాస్ చేసిఉంటాయ్


ఇక యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాసిం,సన్‌ఫార్మా, హెచ్‌సిఎల్‌టెక్ స్వల్పంగా

నష్టపోయాయ్


మార్కెట్ల తీరుని గమనించినప్పుడు ఒకదాని తర్వాత ఒక సెక్టార్ అద్భుతంగా రాణించడం

గోచరిస్తోంది

Comments