ఆథార్ తీసుకోవడం అంత సులువు కాదు గురూ



ప్రస్తుతానికి ఓ గుర్తింపుకార్డుగానే చూస్తున్నా...సర్వరోగనివారిణి జిందాతిలిస్మాత్‌లా..ప్రతి లావాదేవీకి ఆధార్

అనుసంధానం తప్పనిసరిగా చేస్తున్నారు. ఆధార్ కార్డ్ అడగాలనే కానీ పావుగంటలో ఇచ్చేస్తున్నారు కూడా, ఐతే

తొందర్లోనే, ఆధార్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదన్నట్లుగా నిబంధనలు మార్చబోతున్నారట


దీని ప్రకారం కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వం వాకబు చేయనుంది. ఇది పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహాలో ఉంటుంది. SDM స్థాయి అధికారి ఆమోదం పొందిన తర్వాతే కొత్త ఆధార్ కార్డు జారీ చేయబడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందంటున్నారు కూడా..!


కొత్త విధానంలో దరఖాస్తుదారుని భౌతిక ధృవీకరణ కోసం జిల్లా స్థాయిలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ మరియు సబ్-డివిజన్ స్థాయిలో SDM ను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఈ అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే కార్డులు జారీ చేయబడతాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా జిల్లా హెడ్ పోస్టాఫీసులు సహా కొన్ని ఆధార్ కేంద్రాలను ఎంపిక చేస్తారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) కొత్త సూచనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతకు మాత్రమే ఈ ప్రక్రియ వర్తిస్తుంది. అయితే ఒకసారంటూ ఆధార్ తీసుకుంటే, ఆ తర్వాత అన్ని రకాల అప్‌డేట్‌లు సులభంగా చేసుకోవచ్చు

ఈ కొత్త పద్దతి కొత్తగా ఆధార్ తీసుకునేవారికి మాత్రమే 

Comments