ఓలా....అదిరిపోలా...ఐపిఓకి రెడీ

 క్రేజీ ఈవీ స్కూటర్స్ మేకర్ ఓలా ఐపిఓ ద్వారా లిస్ట్ కావడానికి రెడీ అయింది. 2024లో ఈ సంస్థ తన షేర్లను లిస్ట్ చేయడానికి సిద్ధమైంది. 5500కోట్ల వరకూ ఇష్యూ ద్వారా సేకరించాలనేది టార్గెట్ కాగా..సెబీ దగ్గర అప్లై చేసినట్లు తెలుస్తోంది. 



2008లో బజాజ్ ఆటో మార్కెట్ అరంగేట్రం తర్వాత వస్తున్న తొలి టూవీలర్ తయారీ కంపెనీ ఐపీవోగా ఓలా ఎలక్ట్రిక్ నిలవనుంది. సింగపూర్ పెట్టుబడి సంస్థ టెమాసెక్ ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ విలువ 5.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టూవీలర్ ఈవీల మార్కెట్లో ప్రస్తుతం ఓలా 32 శాతం వాటాను కలిగి ఉంది. ఇది టీవీఎస్, బజాజ్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలతో పోటీ పడుతోంది. కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి స్టాండలోన్ లాస్ రూ.1,472 కోట్లకు పెరిగినప్పటికీ.. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడు రెట్లు పెరిగింది.


ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన వ్యయం, Ola గిగాఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోసం OCT, అనుబంధ సంస్థ OET ద్వారా చేయబడిన రుణభారం పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడం అవసరాల కోసం కంపెనీ వెచ్చించనుందని సమాచారం. ఈవీలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం తగ్గించిన తర్వాత ధరలు పెరిగాయి. దీంతో లాభాలను సాధించాలనే లక్ష్యాన్ని కంపెనీ ఒక ఏడాది ఆలస్యం చేసింది. అలాగే మార్చి 2024 నాటికి 3 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేయాలని కంపెనీ ఆశిస్తోంది


Comments