ర్యాలీకి చిన్న బ్రేక్, ఆటో , కేపిటల్ ర్యాలీ

 


ఇండియన్ స్టాక్ మార్కెట్లు వరస లాభాల సెషన్లకి బ్రేకేశాయ్. నిఫ్టీ 90పాయింట్ల

వరకూ నష్టపోగా, సెన్సెక్స్ 300 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఐతే రెండూ కూడా

తమ తమ సెంటిమెంట్ మార్క్స్ కోల్పోకుండా కంఫర్టబుల్‌గా ట్రేడవుతున్నాయ్


బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోయింది.కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్,ఆయిల్ అండ్ గ్యాస్

పిఎస్ఈ స్టాక్స్ అరశాతం వరకూ నష్టపోగా, ఎప్ఎంసిజి,కేపిటల్ గూడ్స్,ఆటోస్టాక్స్

పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయ్. 


టాటామోటర్స్, టాటాకన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ ట్విన్స్, నెస్లే అరశాతం నుంచి నాలుగు

శాతం వరకూ ర్యాలీ చేయగా, బిపిసిఎల్, ఓఎన్‌జిసి,కోటక్ మహీంద్రా, ఎస్బీఐ, ఎన్టిపిసి ఒకటిన్నర నుంచి రెండున్నరశాతం వరకూ నష్టపోయాయ్

Comments