సోలార్ ఎనర్జీ కార్పోరేషన్‌తో అదానీ బిగ్ డీల్

 అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL), 1,799 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (PPA) ఫైనలైజ్ చేసింది. సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం జరిగిన ఈ ఒప్పందం పాతికేళ్లపాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా SECIకి ఈ పాతికేళ్లలో1799 మెగావాట్ల పవర్ సప్లై చేయాలి


జూ


న్ 2020లో SECI ద్వారా మొత్తం 8,000 MW తయారీ-లింక్డ్ సోలార్ టెండర్‌ని AGEL దక్కించుకుంది. పిపిఏ పద్దతిలో ఇది జరగాల్సి ఉండగా

సోలార్ పవర్ టెండర్లలో ఇదే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా అప్పట్లో చెప్పారు. ఇందుకోసం AGEL 2 GW ఫోటోవోల్టాయిక్ (PV) సెల్ , మాడ్యూల్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అలానే గుజరాత్‌లోని ముంద్రాలో ఒక కమీషన్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 

AGEL యొక్క అసోసియేట్ కంపెనీ, ముంద్రా సోలార్ ఎనర్జీ లిమిటెడ్ (MSEL), తయారీ కర్మాగారాన్ని నిర్వహిస్తుండగా,  2 GW కెపాసిటీ దీనికి ఉంది

అలానే అదానీ గ్రీన్ ఎనర్జీకే చెందిన  అనుబంధ సంస్థ అయిన అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్‌కి MSELలో 26 శాతం వాటా ఉంది


తాజాగా కుదిరిన ఒప్పందం ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ ఖాతాలో 19.8 గిగావాట్ల విద్యుత్ పిపిఏ ఒప్పందాలు ఉన్నట్లైంది

Comments