ఇన్పోసిస్ పడింది కానీ..మరీ ఎక్కువగా కాదు

 ఇన్ఫోసిస్ స్టాక్ ఊహించినట్లే..నష్టాల్లో ట్రేడ్ ప్రారంభించగా, ఎక్స్‌పెక్ట్ చేసినంతగా మాత్రం

పతనం కాలేదు. 2శాతం వరకూ నష్టపోయి రూ.1523 ధరకి పతనమై తిరిగి రూ.1548 స్థాయికి చేరింది



గత వారంలో క్లయింట్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సర్వీసులకు సంబంధించి భారీ డీల్

క్యాన్సిల్ చేయడంతో..స్టాక్ ట్రేడ్‌పై నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఐతే

ఇది పదిహేనేళ్లపాటు సాగే కాంట్రాక్ట్  కావడంతో పాటు, సెప్టెంబర్‌లో కుదుర్చుకున్నది మెమొరాండమ్

ఆఫ్ అండర్ స్టాండింగ్ మాత్రమే కావడంతో,ప్రతికూల ప్రభావం పెద్దగా పడలేదనుకోవాలి. 


ఐనా సరే..పదిహేనువందల కోట్ల డాలర్ల ఒప్పందం రద్దు కావడం అంటే..అది ఆలోచించాల్సిన విషయమే


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఇన్ఫోసిస్ షేర్లు రూ.1542 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments