నువ్ పోలీస్‌వి..నీకు లోనివ్వను పో..!'

 






పోలీసులంటే జనంలో గౌరవం కంటేకూడా భయం, ఏహ్యభావనే ఎక్కువగా ఉంటుంది

చట్టప్రకారం మాత్రం రక్షణ కల్పించాల్సింది వాళ్లే కాబట్టి ఈ మాత్రం గౌరవమన్నా

ఉంది కానీ..జనంలో అసలా పక్కకు పోకుండా ఉండటమే బెటర్ అనే ఫీలింగే ఎక్కువ


జమ్ము కశ్మీర్‌లో ఓ పోలీసాయన లోన్ కోసమని HDFC బ్యాంక్‌కి వెళ్తే..ఇలాంటి

అనుభవమే ఎదురైంది. ఖాఖీ యూనిఫామ్‌లోని వారికి లోన్లివ్వమంటూ సదరు 

బ్యాంక్ సిబ్బంది నిరాకరించారట..పైగా అది తమ పాలసీ అని కూడా చెప్పార్ట

ఇది చాలా బాధాకరం..నేను హర్ట్ అయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లకు

దిగాడా ఇంతియాజ్ హుస్సేన్ అనే పోలీస్ !



ఐతే బ్యాంక్ మాత్రం వేరేగా స్పందించింది. చాలామంది పోలీసులు దేశవ్యాప్తంగా తమ

లోన్లు తీసుకున్నారని..మా దగ్గర అలాంటి పాలసీ ఏదీ లేదంటూ మర్యాదగా

స్పందించింది. ఐతే చాలామంది నెటిజన్లు..బ్యాంక్‌పై ఇలాంటి ఆరోపణలకే దిగారు

తమ వృత్తుల ఆధారంగా ఋణాలను మంజూరు చేయడం లేదని వాపోయారు

Comments