రాబోయే రోజుల్లో IT, ఫార్మా షేర్లే ఇరగదీస్తాయ్...చూడండి బాసూ ఈ స్టాక్స్ ని

 US ఫెడరల్ రిజర్వ్ వచ్చే క్యాలెండర్ సంవత్సరానికి మూడు రేట్ల కోతలను సూచించడంతో, FIIలు బ్యాంగ్‌తో తిరిగి వస్తారనే

అంచనాలు హీట్ పెంచేస్తున్నాయ్.  గత 3 నెలల్లో దాదాపు


రూ.75,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) డిసెంబర్‌లో ఇప్పటివరకు రూ.29,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.


ఎఫ్‌ఐఐలు భారతదేశానికి తరలి రావడంతో, అందరి దృష్టి లార్జ్-క్యాప్‌లపైనే పడింది. ప్రత్యేకించి నిఫ్టీ 50 స్టాక్‌లలో లిక్విడిటీ సమస్య ఉండదు.2022లో రేట్ పెంపు చక్రం ప్రారంభమైనప్పటి నుండి ఎఫ్‌ఐఐ వాటాలో తగ్గుదల నమోదైంది. ఐతే ఇప్పుడు ప్రవాహం రెడీగా ఉంది కాబట్టి.. ఐటి, ఫార్మా , బ్యాంకులు ఆమేరకు ఇబ్బడి ముబ్బడిగా లాభం పొందుతాయంటున్నారు


 Wipro, TCS, LTIMindtree, Infosys, FII వాటాలు రేట్ హైక్ సైకిల్ కంటే 2-3 శాతం దిగువన ఉన్నాయి. టెక్ మహీంద్రాకి, వ్యత్యాసం 9 శాతం పాయింట్ల వరకు ఉంది. రేట్ సైకిల్ టర్నింగ్‌తో, పెద్ద క్లయింట్‌ల మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయని తెలుస్తోంది. అలానే మరో రంగం ఫార్మాలో సిప్లా, దివీస్ లాబొరేటరీస్ వంటి స్టాక్‌లు రేట్ పెంపు చక్రంలో ఎఫ్‌ఐఐ వాటాలు 3-5 శాతం పాయింట్లు పడిపోయాయి. మరోవైపు, సన్ ఫార్మా మరియు డాక్టర్ రెడ్డీస్ ఇదే కాలంలో తమ ఎఫ్‌ఐఐ వాటాను పెంచుకున్నాయి..సో ఈ కంపెనీలు ఇక విజృంభించడం ప్రారంభం అవుతుందనే అంచనాలు ఈసరికే మొదలుకాగా..ఇండెక్స్‌లు దానికి తార్కాణంగా కూడా నిలిచాయ్

Comments