దంచిపారేసిన LIC, నెలలో 3సార్లు రికార్డ్ తిరగరాసినా ఇంకా నష్టమే

 ఉదయం మన అంచనాలకు తగినట్లుగానే ఎల్ఐసి షేర్లు దంచి పారేశాయ్. ఇంట్రాడేలో 8శాతం వరకూ ర్యాలీ చేశాయ్.అలా రూ.821 ధర పలికాయ్. డిసెంబర్ నెలలో 800 రేటుని ఎల్ఐసి షేర్లు దాటడం ఇది మూడోసారి . అంతేకాదు ఈ మూడుసార్లు ఎల్ఐసి తన 52వీక్స్ హై రేటుని క్రాస్ చేసింది



జనరల్‌గా ఇలా తమ ఏడాది గరిష్ట ధరని సవరిస్తున్న షేర్లను అమ్ముకోవద్దని చెప్తుంటారు. ఐతే ఈ నష్టజాతక కంపెనీ( లిస్టైనప్పట్నుంచి) లో ఎక్కువరేటులో ఇరుక్కుపోయిన వారు ఇంకా ఎదురుచూసే ఓపిక లేనివారు ఖచ్చితంగా ఈ రేట్లదగ్గర ఎగ్జిట్ అవుతారు. ఇదే క్రమంలో

స్టాక్ రేటు ఇంకా పెరుగుతుండటం చూసి ఉస్సూరంటుంటారు..ఇదంతా మార్కెట్లలో కామన్ ఫినామినా..!


పబ్లిక్ షేర్ హోల్డింగ్ పాతికశాతం చేరకపోవడంతో..కేంద్రం ఈ సంస్థకి ఏకంగా పదేళ్లపాటు వెసులుబాటు కల్పించింది. జనరల్‌గా ఏదైనా సంస్థ లిస్టైన తర్వాత ఏడాదికాలంలోపు పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీసం పాతికశాతం ఉండాలని రూల్ ఉంది. దాన్నే కేంద్రం ఈ ఎల్ఐసి 

విషయంలో సడలించింది. ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఎల్ఐసిలోని 95శాతంవాటా ఉన్నట్లుంది


ఈ స్టాక్ ఇష్యూ అలాట్‌మెంట్ ప్రైస్ రూ.949..!


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి LIC షేర్లు రూ.805.95 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments