టాప్ 2 డిజప్పాయింట్..ఐనాఇండెక్స్ పైకే


నిన్న ప్రకటించిన రెండు ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ఐనా మార్కెట్లలో ఐటి ఇండెక్స్  భారీ ర్యాలీ చేస్తోంది



ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 6,586 కోట్లతో పోలిస్తే  ఏడాది ప్రాతిపదికన 7.3 శాతం క్షీణంచింది.

5 నుంచి 8 శాతం డీ-గ్రోత్ లెక్కలకు అనుగుణంగానే ఈ రిజల్ట్స్‌ని చూడాలి.. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.38,318 కోట్లుగా ఉన్న  ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.38,821 కోట్లకు చేరుకుంది..అలానే రూపాయి పరంగా ఫ్లాట్ రెవెన్యూ వృద్ధి, ఆపరేటింగ్ మార్జిన్ 20.5 శాతంగా ఉంది. క్రితం సంవత్సరం 2.5 శాతంతో పోలిస్తే 100 బేసిస్ పాయింట్లు తగ్గాయి. డాలర్ ఆదాయం $4,663 మిలియన్లుగా నమోదు కాగా..కాన్‌స్టంట్ కరెన్సీ 1 శాతం సీక్వెన్షియల్ క్షీణత నమోదు చేసింది. ఐతే

ఇదే  త్రైమాసికంలో బిగ్‌డీల్ కౌంట్  $3.2 బిలియన్‌గా ఉండటమే ప్లస్‌పాయింట్ అనుకోవాలి


ఇన్ఫోసిస్ మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) సెప్టెంబర్ త్రైమాసికంలో $7.7 బిలియన్లు, జూన్ త్రైమాసికంలో $2.3 బిలియన్లుగా ఉంది.

మొత్తంగా ఐటీసెక్టార్ మిక్స్‌డ్ రిజల్ట్సే ఎక్స్‌పెక్ట్ చేస్తుండగా..టెక్,ఐటీ షేర్లు చెరో ఐదుశాతం లాభపడటం ఇవాళ్టి ట్రేడింగ్ హైలైట్

Comments