ఐసిఐసిఐ బ్యాంక్‌కి రిజల్ట్ ఎఫెక్ట్, స్టాక్ 4% అప్, 52వీక్స్ హై రేటుకి జంప్



అక్టోబర్-డిసెంబర్ మధ్యలో బ్యాంక్ నికరలాభం 23శాతం పెరగడంతో

ఐసిఐసిఐ  బ్యాంక్ షేర్లు లాభంతో ట్రేడవుతున్నాయ్. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో

ఈ బ్యాంక్ స్టాక్ 4శాతానికిపైగా లాభపడి..1059.40కిచేరింది. ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు


కౌంటర్ వాల్యూమ్స్ కూడా భారీగా 2 కోట్ల సంఖ్యలో జరగడం విశేషం

క్యు3 నికరలాభంలో 23.6శాతం వృద్ధితో ఐసిఐసిఐ బ్యాంక్ రూ.10271.54కోట్లుగా ప్రకటించింది

అలానే నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్ 13.4శాతం పెరిగి రూ.18678.55కోట్లకి చేరింది. ఓ వైపు బ్యాంక్ తన

ప్రొవిజన్లు భారీగా ఉన్నా..మంచి లాభమే రాబట్టడంతో..స్టాక్ జోరుగా ట్రేడవుతోంది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ICICI బ్యాంక్ షేర్లు  రూ.1039.90 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments