కెనరా బ్యాంక్ లాభాల జాతర



ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్రేజీ బ్యాంక్ ఏదైనా ఉందంటే..అది కెనరా బ్యాంక్ మాత్రమే..

ఈ బ్యాంక్ వరసగా క్వార్టర్ పై క్వార్టర్ లాభాలను ప్రకటిస్తూనే పోతోంది. ఆ క్రమంలోనే నిన్న కూడా తన 2023-24  అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.3,656 కోట్ల నికర లాభాన్నిఆర్జించినట్లు తెలిపింది. ఇది క్రితం ఏడాది క్యు3తో పోల్చితే ఏకంగా ( రూ.2,881.52కోట్లు)26.87 శాతం ఎక్కువ


క్యు2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 9.50 శాతం వృద్ధితో రూ.9,417 కోట్లకి జంప్ చేసింది. అలానే వడ్డీ మార్జిన్ 9 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 3.02 శాతానికి చేరుకుంది. బ్యాంక్ గ్లోబల్ డిపాజిట్లు రూ.12,62,930 కోట్లుగా ఉండగా.. అడ్వాన్స్‌లు రూ.9,50,430 కోట్లకి చేరాయ్. గ్లోబల్ బిజినెస్  9.87 శాతం పెరిగి రూ.22,13,360 కోట్లకు చేరుకుంది.


అలానే NPAలు కూడా 5.89 శాతం నుంచి 4.39 శాతానికి తగ్గాయి. ఈ ఒక్క త్రైమాసికంలో నికర ఎన్పీఏ 1.32 శాతంగా ఉంది.


షేరు పరంగానూ కెనరా బ్యాంక్ షేర్లు గత ఏడాదంతా దంచికొట్టేశాయ్. రెట్టింపులాభాలను అందించాయ్. నిన్న కెనరా బ్యాంక్ షేర్లు రూ.455.10 దగ్గర క్లోజ్ అయ్యాయ్. ఇక ఈ రోజు మరి ర్యాలీ ఖాయం చేశాయ్

Comments