ముత్తూట్ ఫిన్‌కార్ప్ పండగ,పద్నాలుగు శాతం దంచి కొట్టిన షేర్లు

 


ముత్తూన్ ఫిన్‌కార్ప్ షేర్లు దంచిపడేస్తున్నాయ్. మంగళవారం మార్కెట్లలో ఈ స్టాక్ ఏకంగా 14 శాతంలాభపడింది. అలా ఇంట్రాడే హై రేటు రూ.266.80కి జంప్ చేసింది



 క్యు3లో ఈ సంస్థ తన లాభాన్ని రెట్టింపు చేయడమే ఇందుకు కారణం.అక్టోబర్-డిసెంబర్ మధ్యలో ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థ రూ.124.60 కోట్ల లాభం ప్రకటించింది. 

అలానే నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్ 52శాతం పెరిగి రూ.343 కోట్లకి చేరింది. 


మొత్తం ఆదాయం రూ.585 కోట్లకు దాదాపుగా చేరింది ఈ నంబర్లు ఇంప్రెసివ్‌గా ఉండటంతో..ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థ షేర్లు పరుగులు పెట్టాయ్. స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి ముత్తూట్ మైక్రోఫిన్ షేర్లు రూ.258.10 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments