టెక్నికల్ గా ట్రెండ్ బేరిష్



 మార్కెట్లు కొత్త వారంలో టెక్నికల్‌గా అనిశ్చితంగా ఉండొచ్చనేది అంచనా !  రెసిస్టెన్స్ 21850 పాయింట్లదగ్గర, 21300 పాయింట్ల దగ్గర

సపోర్ట్ ఉండవచ్చు..ఈ రెండు లెవల్స్ బ్రేక్ అయినప్పుడు తదనుగుణంగా ట్రెండ్ డిసైడ్ అవుతుందని అనలిస్టులు చెప్తున్నారు. 


ఇక శనివారం ఓ అదనపు ట్రేడింగ్ సెషన్..సెన్సెక్స్ 260 పాయింట్లు పడిపోయి 71,424కి, నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 21,572 దగ్గర సెటిల్ అయ్యాయ్. డైలీ చార్టులలో బేరిష్ ఎంగల్ఫింగ్ రకమైన నమూనాను పోలి ఉండే బేరిష్ క్యాండిల్ స్టిక్ నమూనా ఏర్పడినట్లు అనలిస్టులు చెప్తున్నారు.ఇదే సందర్భంలో HDFC సెక్యూరిటీస్‌ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి

అభిప్రాయం ప్రకారం.. " లాంగ్ చార్ట్‌లో చాలా కాలం తర్వాత ఇటువంటి బేరిష్ నమూనాలు ఏర్పడటం - మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తుంది" కాబట్టి...ఈ అంచనాల ప్రకారం

మార్కెట్లలో ర్యాలీ వస్తే..అమ్మకాలు చోటు చేసుకుంటాయని అనుకోవచ్చు

Comments