బౌన్సైంది ..మరి కొనవచ్చా..


మొన్న మార్కెట్‌ సెషన్లో జీ ఎంటర్‌టై


న్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 30 శాతం లోయర్ సర్క్యూట్‌కి చేరాయి. సోనీ పిక్చర్స్‌తో డీలి క్యాన్సిల్ కావడంతో స్టాక్ ఇలా కాగా..నిన్న అవే షేర్లు 8 శాతానికి పైగా ఎగబాకాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జీ షేర్లు ఇప్పటివరకు దాదాపు 44 శాతం మేర క్షీణించడం గమనార్హం. మరిప్పుడు రిస్కీ బెట్‌కింద జీ వైపు చూడవచ్చా అంటే..ఇందులో ఇంట్రిన్సిక్ వేల్యూ ఎంత ఉందో

చూడాల్సి ఉంటుంది అంతే కాదు..బ్రోకరేజ్ సంస్థలు జీ షేరుకు రూ.130 టార్గెట్ ప్రైస్ చెప్తున్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌తో సోనీ పిక్చర్స్ తన 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందాన్ని ముగించింది. అంతేకాకుండా నిబంధనల ఉల్లంఘన కారణంగా 90 మిలియన్ డాలర్ల టెర్మినేషన్ ఫీజు చెల్లించాలని కోరింది. ఈ మేరకు కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్(గతంలో సోనీ పిక్చర్స్) బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ మేరకు జీ నోటీసు అందుకుంది. అయితే డీల్ బ్రేక్  కోసం సోనీ చేసిన క్లెయిమ్‌ను, ఆరోపించిన ఉల్లంఘనలను జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఖండించింది. 'షేర్‌హోల్డర్ల ప్రయోజనాల దృష్ట్యా డీల్ పూర్తి చేసేందుకు జీ నిలకడగా కృషి చేసింది. విలీన సమయాన్ని పొడిగించే ఉద్దేశ్యంతో కల్వర్ మాక్స్, BEPLతో చాలాసార్లు చర్చలు జరిపింది. అయితే దురదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదు' అంటూ జీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ వివాదం తప్పకుండా కోర్టులు..అప్పిలేట్ అథారిటీల మెట్లు ఎక్కడం ముందు రోజుల్లో చూడబోతున్నాం..ఎందుకంటే జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఇప్పటికే ఫైనాన్స్ మినిస్ట్ట్రీకి ఈ వ్యవహారంపై లేఖ

రాయడమే ఇందుకు తార్కాణం

Comments