పాలీక్యాబ్‌కి కష్టాలు..

పాలీక్యాబ్ కంపెనీకి కష్టాలు తొలగిపోవడం లేదు..గతేడాదిలో ఈ కంపెనీకి సంబంధించిన పన్ను రికార్డులు తనిఖీ చేసిన ఆదాయపు పన్నుశాఖ..తాజాగా కూడా సోదాలు చేస్తోంది. దాదాపు 50 గోడౌన్లలో  ఈరకపు తనిఖీలు చేయడమే కాకుండా..1000 కోట్ల రూపాయల లెక్కల్లో తేడా ఉందని ప్రకటించింది


1000 కోట్ల మేర లెక్కల్లేని ధనం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ చెప్పడంతో..పాలీ క్యాబ్ షేర్లు భారీగా పతనం అయ్యాయ్. దాదాపు పాతికశాతం ఒక్కరోజే షేరు ధర నేలరాలింది. రూ.3801 ధరకి చేరింది


ఐతే ఇదే సమయంలో బోలెడు బ్లాక్ డీల్స్ కూడా ఈ కౌంటర్‌లో చోటు చేసుకున్నాయ్. రూ.1293కోట్ల మేర బ్లాక్ డీల్స్ పూర్తయ్యాయ్. ఇది మొత్తం పెయిడప్ కేపిటల్‌లో 2.2శాతానికి సమానం


స్టోరీ పబ్లిష్ అయ్యేసరికి రూ.4007 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments