వారెవా రిలయన్స్ రికార్డుల మోత...మార్కెట్లలో రీసౌండ్

 మార్కెట్లు  ఉదయం అంచనా వేసినట్లే దూసుకుపోతున్నాయ్. ఇంట్రాడేలో

నిప్టీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 385 పాయింట్లు లాభపడింది. ఇది 2024లో ప్రస్తుతానికి

సింగిల్ డే సెకండ్ బిగ్గెస్ట్ గెయిన్..! ఈ నెలలోనే 400 పాయింట్లు పతనం అయింది కూడా...!



సెన్సెక్స్ కూడా 1260 పాయింట్లకిపైగా పరుగెత్తింది. దీంతో ఇన్వెస్టర్లంతా ఓరకమైన యూఫోరియాలో ఉన్నారు. మరోవైపు నంబర్ వన్ కంపెనీ రిలయన్స్..బ్యాంక్ స్టాక్ HDFC, అదానీ ట్విన్స్ కూడా జోరుగా ట్రేడవుతున్నాయ్


రిలయన్స్ స్టోరీ పబ్లిష్ చేసేలోపే తన రికార్డ్ రేటుని మరోసారి సవరించిం రూ.2900 దాటేసింది. రూ.2904 దగ్గర కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ ప్రస్తుతం 19,53,144 కోట్లుగా ఉండగా..ఇంకో 47వేల కోట్లు సాధిస్తే...20లక్షల కోట్ల మార్కెట్ కేపిటైలజేషన్ సాధించిన తొలికంపెనీగా రికార్డులను బద్దలు కొడుతోంది

Comments