బీట్ ది ట్రెండ్..ఒరాకిల్ అప్పరప్పర తాండ్ర





ట్రెండ్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా...సరే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ స్టాక్ మాత్రం ఈరోజు దంచిపడేసింది. 20శాతం ఇచ్చిపడేసి..ఏకంగా 52వారాల గరిష్టానికి చేరింది. దీంతో స్టాక్ ఎకాఎకిన 6వేల మార్క్ దాటి

రూ.6098 రేటు దగ్గర లక్క వేసినట్లు అతుక్కుపోయింది


ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిసెంబర్ క్వార్టర్‌లో 69,40శాతం పెరిగి రూ.740.80కోట్లు ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ.437.30 కోట్లు మాత్రమే లాభం రాగా, ఆదాయం 25.90శాతం పెరిగి రూ.1823 కోట్లకి పెరిగింది. ఆపరేటింగ్ ఇన్‌కమ్ రూ.840 కోట్లు కాగా..ప్రొడక్ట్ బిజినెస్ రూ.1680కోట్లు కాగా..క్లౌడ్ సాస్ విభాగాల్లో  దాదాపు 50 మిలియన్ డాలర్ల లైసెన్స్ ఫీజ్ వస్తున్నట్లు..కంపెనీ ఎండి సిఈఓగా మకరంద్ పడాల్కర్ చెప్పారు


స్టోరీ పబ్లిష్ అయ్యే  టైమ్‌కి ఒరాకిల్ పైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రూ.6217 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments