ఛాంగు భళా బాగుంది కదా..ఎల్ఐసి జోరు..!



లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్లు , మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చిన 20నెలల తర్వాత తొలిసారిగా లిస్టింగ్ ప్రైస్‌ని క్రాస్ చేశాయ్. ఈరోజు ఈ స్టాక్ 5శాతం లాభపడి రూ.895కి చేరింది

దాంతో మే 17,2022నాటి లిస్టింగ్ ప్రైస్ రూ.867ని దాటినట్లైంది..అప్పట్లో ఇష్యూ అలాట్‌మెంట్ రేటు రూ.949 కాగా దాదాపు 9శాతం డిస్కౌంట్‌తో లిస్టైన సంగతి, ఈ షేర్లు అలాటైనవారికి గుర్తుండే ఉంటుంది


గత ఆరు నెలలకాలం నుంచి ఎల్ఐసిలో మంచి స్పీడ్ కన్పిస్తోంది. ఏవో కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేస్తామని చెప్పడం నుంచి..తాను పెట్టుబడి పెట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ యమాజోరుగా పైకి లేవడం కూడా దీనికి మరో కారణంగా చూడాలి. చెత్త కంపెనీలను వెతికి మరీ ఇన్వెస్ట్ చేసిన ఘనత ఎల్ఐసికి ఉంది.అలాంటిది ఇప్పుడు అదానీ గ్రూప్

రివైవల్ కారణంగా దాని పెట్టుబడుల వేల్యూ కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఐతే తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎల్ఐసి అదానీ గ్రూప్ స్టాక్స్‌లో మూడింటిలో కొంతమేర పెట్టుబడిని ఈ క్యు3లో విక్రయించిందని...!


మార్చి 29,2023న ఎల్ఐసి స్టాక్ రూ.530కి కూడా పతనం అయింది.

Comments