భారీ పతనం...బ్లాక్ వెడ్న్స్ డే

 స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయ్.ట్రేడ్ ప్రారంభంలోనే నిఫ్టీ 400 పాయింట్ల వరకూ పతనం అయింది. దీంతో ఇదో బ్లాక్ వెడ్న్‌డేగా 2024లో మారే అవకాశం కన్పిస్తోంది. ఐతే ఈ కరెక్షన్ మంచిదేనంటూ విశ్లేషణలు వస్తున్నాయ్.


 గత ముగింపు 


22032 పాయింట్లతో పోల్చితే ఈ రోజు నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు పతనం అయింది. ఐతే గత నాలుగు నెలలుగా

సాగిన జైత్రయాత్రతో పోల్చినప్పుడు ఇది పట్టించుకోదగిన అంశం కాదనేది వారి పాయింట్

సెన్సెక్స్ 73128 పాయింట్ల నుంచి 71998  పాయింట్లకు పతనం అయింది. 1130 పాయింట్లు ఎకాఎకిన నేలరాలాయ్.


బ్యాంక్ నిఫ్టీ పతనమే ఇవాళ ఎక్కువగా కన్పిస్తుండగా, ఆటో,మెటల్స్ ఆ తర్వాత స్థానాల్లో నష్టపోతున్నాయ్.ఇంత పతనంలోనూ కేపిటల్ గూడ్స్, పిఎస్ఈ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పాజిటివ్‌గా ట్రేడ్ కావడం విశేషం.

Comments