లాభంతో ఆరంభం...దంచికొట్టిన సిప్లా




 మార్కెట్లు మంగళవారం లాభంతో ప్రారంభం అయ్యాయ్.నిఫ్టీ  ఎగ్జాట్‌గా 21750 పాయింట్లవరకూ పెరిగి..వెనుదిరిగింది. ప్రస్తుతం 21650 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది


సెన్సెక్స్ కూడా 600 పాయింట్లకిపైగా లాభంతో ప్రారంభమై..72వేల పాయింట్లపైకి

చేరింది. తిరిగి 71700 స్థాయిలో ట్రేడవుతోంది


బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా,ఐటి ఇండెక్స్ ఒకటిన్నరశాతం లాభపడింది

ఆటో సెక్టార్ పావుశాతం లాభంతో ట్రేడవుతుండగా, కేపిటల్ గూడ్స్ నష్టాల్లో ట్రేడవుతోంది.

ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఒకశాతం నష్టపోగా, హెల్త్‌కేర్ షేర్లు 2శాతం ర్యాలీ చేసింది


సిప్లా, సన్‌ఫార్మా,పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ మూడు నుంచి

7శాతం దంచికొట్టేశాయ్.వీటిలో ఎయిర్ టెల్ మినహాయిస్తే మిగిలినవాటికి రిజల్ట్ ఎఫెక్ట్ బాగా పాజిటివ్‌గా పని చేసింది.HDFC బ్యాంక్, బిపిసిఎల్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, హిందుస్తాన్ యునిలీవర్ ఒకటిన్నర నుంచి

రెండుశాతం వరకూ నష్టపోయాయ్

Comments