కెనరా బ్యాంక్‌లో ఉత్సాహం ..కొత్త రికార్డ్ రేటు కోసం తహతహ



కెనరా బ్యాంక్ షేర్లు వడివడిగా పరుగు పెడుతున్నాయ్

గురువారం మార్కెట్ల పరిస్థితి ఏమంత బాలేకపోయినా..ఈ బ్యాంక్ షేరు మాత్రం

మూడున్నరశాతం లాభపడింది. రూ.469.45 వరకూ చేరింది


కెనరా బ్యాంక్ స్టాక్ 52వీక్స్ హై రేటు రూ.484.90


నిన్న రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ అద్భుతంగా ఉండటంతో కెనరా బ్యాంక్ షేర్లు

తొందర్లోనే రూ.500 మార్క్ చేరుతుందనే అంచనాలు ఏర్పడ్డాయ్.


అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.3,656 కోట్ల నికర లాభాన్ని కెనరా బ్యాంక్ ప్రకటించింది. ఇది క్రితం ఏడాది క్యు3తో పోల్చితే ఏకంగా ( రూ.2,881.52కోట్లు)26.87 శాతం ఎక్కువ, అలానే  బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 9.50 శాతం వృద్ధితో రూ.9,417 కోట్లకి జంప్ చేసింది. 

Comments