కాస్త ఆగిందంతే..పాలీక్యాబ్ జోలికి పోవద్దంతే

 


పాలీక్యాబ్ ఇండియా షేర్లు నష్టాలకు బ్రేక్ వేశాయ్. ఐటీ డిపార్ట్‌మెంట్

తమకి ఎలాంటి పన్ను నోటీసు ఇవ్వలేదని పాలీక్యాబ్ మేనేజ్‌మెంట్ ప్రకటించిన తర్వాత

ఈ రోజు ట్రేడ్‌లో స్టాక్ నష్టాలకు బ్రేక్ పడి..కాస్త లాభాల్లో పయనిస్తోంది


ఐతే ఇది తాత్కాలికంగానే భావించాలి. ఎందుకంటే..స్వయంగా వెయ్యికోట్లరూపాయల అమ్మకాలకు

లెక్క లేదు అని ఆదాయపు పన్నుశాఖ అధికారులు చెప్పిన తర్వాత..ఆ నోటీస్ రాకుండా పోదు.లేదంటే వాళ్లైనా

అబద్దం చెప్పాలి..లేదూ..వీళ్లైనా తర్వాత కవర్ చేసుకోగలిగాలి..ఈ రెండింటిలో ఏదోటి తేలేదాకా ఈ స్టాక్‌లో కొత్తగా

ఇన్వెస్ట్ చేయడం దండగ


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి పాలీక్యాబ్ షేర్లు రూ.3990 రేటు దగ్గర ట్రేడ్ అయ్యాయ్. ఇది నిన్నటి ముగింపుతో

పోల్చితే 3శాతం ఎక్కువ

Comments