రంబుల్ టంబుల్ గేమ్..లాభమంతా ఆవిరై..జస్ట్ ఫ్లాట్ క్లోజింగ్

స్టాక్ మార్కెట్లలో షార్ప్ ర్యాలీ తర్వాత అంతే షార్ప్‌గా లాభమంతా ఆవిరైపోయింది

ఐటీ స్టాక్స్ దంచికొట్టడంతోపాటు..ఆటో స్టాక్స్ కూడా దూసుకుపోవడంతో..మార్కెట్లు

భారీగా లాభపడ్డాయ్. ఐతే ఆ తర్వాత సెల్ ఆన్ ర్యాలీస్ అనే సూత్రం ఫాలో కావడంతో...

మార్కెట్లు ఓటవాలుగా పతనం అయ్యాయ్. దీంతో సెన్సెక్స్ 31 పాయింట్లు పెరిగి 71386 పాయింట్ల దగ్గర  నిఫ్టీ 21544 పాయింట్ల దగ్గర  ముగిశాయ్



మరోవైపు షార్ట్ పొజిషన్లు పెరగడం,,లాంగ్ పొజిషన్లు క్రమంగా తగ్గడం రాబోయే

రోజుల్లో బేర్ గ్రిప్ బిగుస్తుందనే నమ్మకానికి సంకేతంగా చెప్తున్నారు. ఐతే గ్లోబల్ క్యూస్ ఏమాత్రం

ఫేవర్‌గా ఉన్నా..ఈ షార్ట్సే కొంపముంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


హీరోమోటోకార్ప్, అదానీ ట్విన్స్, అపోలో హాస్పటల్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటిముప్పావు నుంచి రెండున్నరశాతం వరకూ లాభపడ్డాయ్.బ్రిటానియా,నెస్లే, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, HDFC బ్యాంక్ ముప్పావు నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్

Comments