పెరిగితే అమ్మేయ్...లాభం దండుకో గురూ

 స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ ర్యాలీ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఎదుర్కొంటున్నాయ్. దీంతో నిఫ్టీ ఇంట్రాడేలో 21813 పాయింట్లకు పెరిగి..21655 పాయింట్లకు జారింది



సెన్సెక్స్ కూడా 72వేలపాయింట్లపైకి వెళ్లినట్లే వెళ్లి వెనుదిరిగింది. ప్రస్తుతం 71575 పాయింట్లకు జారి71650 పాయింట్లకు దగ్గర్లో ట్రేడవుతోంది


ఆయిల్ అండ్ గ్యాస్,మెటల్, టెక్, ఐటీ షేర్లలో ర్యాలీ కొనసాగుతుండగా...నిన్న భారీగా లాభపడిన ఆటో,కేపిటల్,కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు ట్రేడర్లు..!


ఈ రోజు నష్టానికి రిలయన్స్ స్టాక్ 2శాతం తగ్గడం ప్రధానకారణంగా చూడొచ్చు..ఈ స్టాక్ కనుక పాజిటివ్‌గా మారితే.. ఇండెక్స్‌లు రెండూ లాభాల్లోకి రావడం ఖాయం

Comments