అయోద్యానగరిలో అమితాబ్ కొత్త ఇల్లు

 ఈ వయసులో ఎందుకు అన్పించిందో కానీ...బిగ్ బి గా పేరుబడిన అమితాబ్‌బచ్చన్ గారు

అయోధ్యలో ఓ ఫ్లాట్ కొనేసారు..ఆ ఫ్లాట్ ఖరీదు పద్నాలుగున్నర కోట్ల రూపాయలు



సిటీ ఆఫ్ సరయాలో ఈ ల్యాండ్ పార్సెల్ ఉండగా...హౌస్ ఆప్ అభినందన్ లోధా అనే డెవలపర్

ఇక్కడ 51 ఎకరాల్లో వెంచర్ వేసారు..ఓ 7 స్టార్ ఎన్‌క్లేవ్‌గా ఇక్కడ భవనాలు నిర్మించబోతున్నట్లు 

చెప్తున్నారు..


ఓ కొత్త ఎయిర్‌పోర్ట్, బీభత్సంగా డెవలప్ చేసిన రైల్వేస్టేషన్..ఇంకా ఎన్నో హంగులతో అయోధ్యని నిర్మిస్తోన్న కేంద్రం ఇక్కడ రియల్ఎస్టేట్ వ్యాపారం భారీగా ఆశించింది..దానికి తగినట్లుగానే పెద్దపెద్దోళ్లంతాప్లాట్లు కొంటున్నారు

కొనేలా చేస్తున్నారు.


పదివేల చదరపు అడుగుల్లో అమితాబ్ బచ్చన్ ఈ ల్యాండ్ కొనగా..ఆధ్యాత్మికత, ఆధునికత సంతరించుకున్న ఈ భూమికి తన హృదయంలో ఓ ప్రత్యేక స్థానం ఉందని..ఇక్కడ ఇల్లు కట్టుకోవడం తనకి ఎంతో ఇష్టమంటూ అమితాబ్ ట్వీట్ కూడా చేసారు. ప్రయాగ్ నగర్లో అమితాబ్ పుట్టగా..అక్కడ్నుంచి అయోధ్యకి నాలుగు గంటల సమయం పడుతుంది

Comments