HCL టెక్నాలజీస్ కేక

 హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ షేర్లు ఇవాళ మంచి ఊపుగా ట్రేడవుతున్నాయ్.సెక్టార్ మొత్తం కలిసికట్టుగా  రాణిస్తుండటంతో

ఈ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 5శాతం వరకూ ర్యాలీ చేసాయ్. దీంతో వరసగా రెండో సెషన్ కూడా 

హెచ్‌సిఎల్ టెక్ షేర్లు లాభం పంచినట్లైంది. 



బ్రోకరేజ్ సంస్థలు వరసగా మూడేళ్లపాటు సంస్థ ఆదాయపు అంచనాలను పెంచేయడంతో..స్టాక్ పై ఇన్వెస్టర్ల

ఫోకస్ కూడా భారీగానే పడినట్లు కన్పిస్తోంది. క్యు3లో అంచనాలను మించిన ఆదాయం ప్రకటించడం కూడా కలిసి వచ్చింది.


హెచ్‌సిఎల్ టెక్ షేర్లు రూ. 1605 ధర వరకూ చేరగా..డిసెంబర్ క్వార్టర్‌లో నికరలాభం రూ.4351కోట్లు గడించడం గుర్తుండేఉంటుంది

రిజల్ట్స్ కి ముందు రోజు కంపెనీ వెరిజోన్,ASAP కొనుగోళ్ల పూర్తైన సందర్భంలోనూ 4శాతం లాభపడింది

Comments