HDFC బ్యాంక్ రిజల్ట్స్ చూడండి..స్పీడ్ తప్పదివాళ




  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాస్టియర్‌తో పోల్చితే థర్డ్ క్వార్టర్‌లో బెటర్ రిజల్ట్స్అనౌన్స్ చేసింది.. గతేడాది డిసెంబర్‌‌లో (2023–24, క్యూ3) బ్యాంక్‌ కన్సాలిడేటెడ్‌ లాభం

12735కోట్లు మాత్రమే కాగా..తాజాగా  (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. ఇది 39శాతం వృద్దితో సమానం


అలానే  మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం పెరిగింది. స్టాండెలోన్‌ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్‌ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది.  

ఇక నెట్ నాన్ పెర్ఫామింగ్ ఎసెట్స్  1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికరంగా ఎన్‌పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది. ఇక ఈ రోజు మంచి స్పీడ్ ప్రదర్శించవచ్చని అంచనా

Comments