టెక్నికల్‌గా బ్రేకౌట్ ...పరుగుపెట్టిన IRFC



ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పోరేషన్ షేర్లు ఇవాళ కేక పుట్టించేశాయ్.

6శాతం పరుగుపెట్టి రూ.109.30 రేటు పలికాయ్

ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై ..ఆల్‌టైమ్ హై కూడా..!


ఈ స్టాక్ టెక్నికల్స్ గురించి ఎస్బీఐ రీసెర్చ్ ఈ రోజే మంచి విషయం చెప్పింది. డైలీ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) డిసెంబరు 2023 నుండి సూపర్ బుల్లిష్ జోన్‌లో నిలకడగా ఉండగా..దానికి రోజువారీ బుల్లిష్ ట్రెండ్ కూడా తోడైనట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం స్టాక్ కన్సాలిడేషన్ బ్రేకవుట్ అంచున ఉంది. SBI సెక్యూరిటీస్‌- టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా చెప్పిన దాని ప్రకారం నిన్న అంటే బుధవారం, స్టాక్ 50-రోజుల సగటు వాల్యూమ్ కంటే ఎక్కువగా ట్రేడైంది. ఇది బ్రేకౌట్ ముందు దశగా చెప్పారాయన. 


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి IRFC షేర్లు రూ.108.50 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments