మిడ్‌క్యాప్‌ టు లార్జ్‌క్యాప్, IRFC మల్టిపుల్ టైమ్స్ రిటన్స్



ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పోరేషన్-IRFC ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తోంది. ఏకంగా ఏడాది క్రితం ఈ స్టాక్ రేటు పాతిక రూపాయలకు కాస్త ఎక్కువ

ఇప్పుడు చూస్తే ఏకంగా రూ.175దాటేసింది. ఈ సంవత్సరం కాలంలో స్టాక్ మార్కెట్ కేపిటలైజేషన్ ఏకంగా మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్‌కి పెరిగింది


శనివారం సెషన్ లో ఈ కంపెనీ షేరు ఏకంగా 20 శాతం లాభపడి అప్పర్ సర్క్యూట్ ని తాకి సరికొత్త 52 వారాల గరిష్టమైన రూ. 176.25 వద్ద ముగిసింది.

గడచిన వారంలోనే కంపెనీ షేరు  45 శాతం లాభపడి మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారింది. దీంతో 2023లోనే కాదు...ఈ కేలండర్ ఇయర్ లోనూ కేక పుట్టించడం ఖాయంగా ఉఁది

గత ఆరు నెలల్లో IRFC 404 శాతం లాభాన్ని, ఏడాది కాలంలో 437% రిటన్స్ ఇవ్వగా..ఐదేళ్లలో ఏకంగా 610 శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ప్రస్తుతం IRFC మార్కెట్ క్యాప్ సుమారు రూ. 2,31,000 కోట్లుగా ఉంది.

Comments