డా.రెడ్డీస్‌కి బూస్ట్..లూజర్లలో L&T లో ప్రాఫిట్ బుకింగ్

 బుధవారం ట్రేడింగ్‌లో నిఫ్టీ టాప్ 5 గెయినర్లుగా


డా.రెడ్డీస్, టాటా మోటర్స్, ఐసిఐసిఐ బ్యాంక్,, మహీంద్రా అండ్ మహీంద్రా

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెండు నుంచి 4శాతం లాభపడ్డాయ్

వీటిలో డా.రెడ్డీస్ తన  క్యు3లో నికరలాభంలో 10.6శాతం వృద్ధి నమోదు చేసింది

రూ.1378 కోట్లకిపైబడిన లాభం ప్రకటించిన ఈ ఫార్మా మేజర్ తన ఆపరేషనల్ రెవెన్యూ 6.6శాతం పెరిగి రూ.7215 కోట్లుగా

ప్రకటించింది. అలానే నార్త్ అమెరికా, యూరప్‌లలో మార్కెట్ షేర్ చక్కగా పెరుగుతున్నట్లు చెప్పింది


లూజర్లలో ఎల్ అండ్ టి , టైటన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్తాన్

యునిలీవర్ అరశాతం నుంచి ఆరుశాతం వరకూ నష్టపోయాయ్

వీటిలో ఎల్ అండ్ టి తన క్యు3 కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్‌లో 15శాతం జంప్ రికార్డ్ చేసింది. 

రూ.2947 కోట్ల లాభం ఆర్జించినట్లు తెలిపింది. అలానే డిసెంబర్ క్వార్టర్‌లో 19శాతం వృద్ధితో

రూ.55,128 కోట్లుగా నమోదు చేసింది. ఐనా సరే..స్టాక్‌లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతుండటంతో..ఇంట్రాడేలో

L&T 6శాతం పతనం నమోదై రూ.3387కి చేరింది

Comments