మార్కెట్ల హుషారు,రిలయన్స్ M-CAP 20లక్షల కోట్లకి దగ్గరగా

 వాల్డ్‌డిస్నీ ఇండియా యూనిట్‌ వేల్యేషన్ సగానికి సగం తగ్గిందనే బ్లూమ్‌బర్గ్ కథనంతో రిలయన్స్ షేర్లు  ఒక్కసారిగా టేకాఫ్  తీసుకున్నాయ్. ఎందుకంటే ఈ కంపెనీనే రిలయన్స్ మీడియా కైవసం .చేసుకోబోతోంది ఈ తరుణంలో రిలయన్స్ తాను ఈ డీల్ కోసం ఖర్చు పెట్టే వ్యయం తగ్గుతుంది కాబట్టి ఆ వారా స్టాక్ రన్ చేస్తోంది


దీంతో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనివిధంగా రిలయన్స్ 5శాతం ర్యాలీ చేసింది. అంతేకాదు

వరసగా మూడో సెషన్ కూడా లాభపడినట్లైంది. దీంతో మార్కెట్ కేపిటలైజేషన్ 19లక్షల20వేల కోట్ల రూపాయలకు చేరింది


రిలయన్స్ స్టాక్ వేల్యూ రూ.2850కి చేరడంతో ఇది ఆల్‌టైమ్‌హైగా రికార్డులకెక్కింది


వాల్డ్‌డిస్నీ యూనిట్ ముందు 10.5 బిలియన్ డాలర్ల మేర వేల్యేషన్ లెక్కగట్టగా..ఇప్పుడు ముకేశ్ అంబానీ దాన్ని 4.5 బిలియన్ డాలర్లకే డీల్ ఓకే చేసేలా బేరం చేస్తున్నట్లు టాక్ !

Comments