మార్కెట్లలో వారాంతపు ఉత్సాహం....22వేలు దాటేసిన నిఫ్టీ

 


స్టాక్ మార్కెట్లు ఈ వారమంతా ముక్కుతూ మూలుగుతా..ఎట్టకేలకు మరోసారి ఆల్‌టైమ్ హై లెవల్స్‌కి దగ్గరగా వచ్చాయ్.నిఫ్టీ ఈ రోజు ఇంట్రాడేలో 22044 పాయింట్లకు చేరగా, ఆల్‌టైమ్ హయ్యెస్ట్ లెవల్‌కిమరో 82 పాయింట్ల దూరంలో ఉంది


సెన్సెక్స్ 400పాయింట్లకిపైగాలాభంతో 72450 పాయింట్ల మార్క్‌ మరోసారి అందుకుంది. ఈ ఊపు కంటిన్యూ అయితే నిఫ్టీ వరకూ పాత గరిష్టాన్ని సవరించే అవకాశం కన్పిస్తోంది


బ్యాంక్ నిఫ్టీ అరశాతంవరకూ లాభపడగా, ఐటీ ఇండెక్స్ అదేబాటలో సాగుతోంది.ఆటో సెక్టార్ టాప్ గేర్‌లో  ట్రేడవుతుండగా, హెల్త్ కేర్, మెటల్ స్టాక్స్ సపోర్ట్ ఇస్తున్నాయ్. పిఎస్ఈసెక్టార్ సబ్‌డ్యూడ్‌గా సాగుతోంది


మారుతి సుజికి, బిపిసిఎల్, బజాజ్ఆటో, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా రెండున్నర నుంచి

మూడున్నరశాతం లాభపడ్డాయి. లూజర్లుగా పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఓఎన్‌జిసి, అపోలో హాస్పటల్, ఐటీసి, బ్రిటానియా ముప్పావు నుంచి రెండుంబావు శాతం వరకూ నష్టపోయాయ్



Comments