మోడీనోట ఆ ఒక్క మాట..24లక్షలకోట్లు పెట్టు

ప్రదానమంత్రి నరేంద్రమోదీ ఆరునెలల క్రితం వాడిన ఒకే ఒక మాట..ఇన్వెస్టర్లకు సిరులు కురిపించింది.పార్టీపరంగా ఆయన్ని వ్యతిరేకించేవారైనా సరే..ట్రేడర్లు, ఇన్వెస్టర్లుగా మాత్రం ఆయనకే తమ ఓటేస్తామని చెప్పేలా చేసింది

అదే PSU మంత్ర..



ఆరు నెలల క్రితం మోదీ..పిఎస్‌యు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయండి..మార్పు రాబోతుంది అంటూ చెప్పారో..లేదో ఇన్‌ఫ్రా, ప్రవేటేజైషన్ ఫుష్‌తో ఈ స్టాక్స్ రయ్‌మంటూ దూసుకుపోయాయ్..దూసుకుపోతూనే ఉన్నాయ్..అలా 56 కంపెనీల షేర్లు మార్కెట్ కేపిటజేషన్

66శాతం పెరిగింది. దాని విలువ ఏకంగా 23.60లక్షల కోట్లుగా లెక్క తేలింది. రేపు ఇంకా పెరగవచ్చు..మొత్తంగా ఈ 56 పిఎస్‌యుకంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ ఇప్పుడు 59.50లక్షల కోట్లకి చేరింది

NTPC,IOC,COALINDIA,POWERGRID,NHPC,SBI,ONGC,BHEL,BEML,BPCL..ఇలా ప్రతి స్టాక్ పట్టినదల్లా బంగారమైపోయింది

వీటిలో టాప్ గెయినర్ NBCC 249శాతం పెరగగా..ఎస్బీఐ 12శాతం రాబడి ఇచ్చింది. ఆరునెలల్లో 12శాతం రాబడి తక్కువ కాదు..కానీ ఇతర PSU కంపెనీలతో పోల్చుకుంటే తక్కువే..ఐతే ఇక్కడ ఇంకో విషయం  చెప్పుకోవాల్సిందేంటంటే..వీటిలో ఏదీ కూడా నెగటివ్ రిటన్స్ ఇవ్వకపోవడం

అదీ సంగతి...!

Comments