7లక్షలకోట్లు దాటేసిన ఎల్ఐసి సంపద...

 రిజల్ట్స్ ఇచ్చిన ఉత్సాహంతో ఎల్ఐసి 6శాతం లాభపడింది

శుక్రవారం మార్కెట్లలో ఎల్ఐసి షేరు ఇంట్రాడేలో రూ.1175 ధరకి చేరింది. ఇది ఈ స్టాక్ ఆల్‌టైమ్ హై , దీంతో కంపెనీ మార్కెట్ వేల్యేషన్ రూ.7లక్షలకోట్లపైకి చేరింది. అలా మోస్ట్ వేల్యూడ్ ఫోర్త్ కంపెనీగా రికార్డులకెక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇన్పోసిస్ ఉండగా..రిలయన్స్, టిసిఎస్, HDFC BANK ఫస్ట్ త్రీ ర్యాంక్స్ లో ఉన్నాయ్



ఎల్ఐసి తనవాటాదారులకు షేరుకు రూ.4 పంపిణీ చేయనుంది..అలా 

డివిడెండ్ రూపంలో రూ.2539 కోట్లు పంచనుండగా. అందులో ప్రభుత్వానికే

రూ.2440కోట్లు వెళ్లనుంది


ఎల్ఐసి క్యు3లో రూ.9444.40కోట్ల లాభం ఆర్జించింది. గతేడాదితో పోల్చితే ఇది 49.1శాతం ఎక్కువ

నెట్ ప్రీమియం ఇన్‌కమ్ రూ.1,17,017 కోట్లు కాగా, నెట్ కమిషన్ 3.2శాతం పెరిగి రూ.6520కోట్లకి చేరింది.ఐతే ఇతరత్రా ఆదాయం మాత్రం రూ.209.75 కోట్ల నుంచి రూ.163.83కోట్లకి తగ్గింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ఎల్ఐసి షేర్లు రూ. 1099దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments