లాభంతో ప్రారంభమై..నష్టాల్లోకి సెన్సెక్స్ 740 పాయింట్స్ డౌన్

 మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభం అయ్యాయ్. దీంతోవరసగా మూడు రోజులు
లాభంతో ప్రారంభమైనట్లైంది. ఐతే చివర్లో లాభాలను ఇండెక్స్‌లు పోగొట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది
 22009 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది
సెన్సెక్స్ కూడా ఇదేలా ట్రేడవుతూ..భారీగా నష్టపోతోంది. ఇప్పటికే సెన్సెక్స్ ఇఁట్రాడేలో 740 పాయింట్లు
నష్టపోయి 71400 స్థాయికి దిగింది



ట్రేడ్ ప్రారంభమైన గంటకి ఆర్బీఐ వడ్డీరేట్లపై నిర్ణయం ప్రకటించిన తర్వాత..మార్కెట్లలో ఈ వీక్‌నెస్ కన్పిస్తోంది. బ్యాంకెక్స్ ఒకశాతం నష్టపోగా, పిఎస్ఈ సెక్టార్ ఒకశాతం లాభంతో ఉంది. మిగిలిన అన్ని రంగాలూ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయ్


పవర్ గ్రిడ్, ఎస్బీఐ,బిపిసిఎల్, హిందాల్కో, హెచ్‌సిఎల్‌టెక్ అరశాతం నుంచి ఐదుశాతం వరకూ

లాభపడగా, మొదటి నాలుగు స్టాక్స్ గత నాలుగు సెషన్లలో కలిసికట్టుగా లాభంలోకో..నష్టంలోకో

పయనించడం గమనించాల్సి ఉంది. ప్రత్యేకించి పవర్ గ్రిడ్, ఎస్బీఐలో నిన్న అమ్మకాలు సాగగా..ఇవాళ లాభం చోటు చేసుకుంది. బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే,టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండున్నర నుంచి మూడుశాతం వరకూ నష్టపోయాయ్

Comments