లాభంతో ఆరంభం, మెటల్స్ మెల్ట్

 


స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజు కూడా లాభంతో ప్రారంభం అయ్యాయ్

నిఫ్టీ 21700పాయింట్లను ఓపెనింగ్ ట్రేడ్‌లోనే అధిగమించించింది.  ఆ తర్వాత

21690పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది



సెన్సెక్స్ 71500 పాయింట్లకు చేరింది. ఇంట్రాడేలో ఓపెనింగ్ ట్రేడ్‌లో

440 పాయింట్ల వరకూ లాభపడింది


బ్యాంక్ నిఫ్టీ ఒకశాతంలాభపడగా, ఐటీ ఇండెక్స్ నెగటివ్‌జోన్మ‌లో ట్రేడవుతోంది

మెటల్ సెక్టార్ రెండున్నరశాతం నష్టపోయింది. పిఎస్ఈ సెక్టార్ అరశాతానికిపైగా

లాభపడగా, ఈ సెక్టార్ నిన్న దారుణంగా నష్టపోయిన సంగతిగుర్తుండే ఉంటుంది

మిగిలిన అన్ని రంగాల్లో ఓ మాదిరి ట్రేడ్ నడుస్తోంది


యుపిఎల్,కోల్ఇండియా,ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్

రెండు నుంచి మూ్డుశాతం లాభపడి టాప్ 5 నిఫ్టీ గెయినర్లుగా నిలవగా, హిందాల్కో

గ్రాసిం, అదానీ ఎంటర్‌ప్రైజెస్, విప్రో, జెఎస్‌డబ్ల్యూస్టీల్ ముప్పావు నుంచిరెండుశాతం 

వరకూ నష్టపోయాయ్. వీటిలో హిందాల్కో దారుణంగా చితకకొట్టబడి14శాతం పతనం అయింది

Comments