అపోలో టైర్స్ లాభం అదుర్స్...ఆదాయం అంతంత మాత్రం..అందుకే చితకబాదుడు


డిసెంబర్ క్వార్టర్‌లో అపోలో టైర్స్ అద్భుతమైన లాభం ప్రకటించినా..స్టాక్

మాత్రం ఈ రోజు నష్టపోతోంది. గురువారం ట్రేడ్‌లో అపోలో టైర్స్ దాదాపు 2శాతం

వరకూ నష్టపోయి రూ.540 స్థాయికి దిగివచ్చింది



అక్టోబర్-డిసెంబర్ మధ్యలో రూ.496.60కోట్ల లాభం ఆర్జించింది అపోలో టైర్స్

ఇది గతేడాది ఇదేకాలంలో వచ్చిన లాభంతో పోల్చితే ఇది 78.1శాతం ఎక్కువ.డిసెంబర్ లో అపోలో టైర్స్ ఆదాయం  రూ.6595.40కోట్లకి చేరింది.అలా ఆదాయంలో  2.7శాతం మాత్రమే వృద్ధి పెరగడంతో..ట్రేడర్లు మైనస్ పాయింట్‌గా చూసినట్లున్నారు. మరోవైపు

మోర్గాన్ స్టాన్లీ ఈ స్టాక్‌కి ఈక్వల్ వెయిట్ ఇచ్చింది. అంతేకాదు స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.433గా ఫిక్స్ చేయడం గమనించాలి


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి అపోలో టైర్స్ షేర్లు రూ.541 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments