పేటిఎం మోత...పట్టించుకోకండి

 కంపెనీ నోడల్ బ్యాంక్‌గా యాక్సిస్ బ్యాంక్‌తో టై-అప్ చేయడంతో పాటు కార్యకలాపాలను ఆపడానికి RBI Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPB) గడువును మార్చి 15 వరకు పొడిగించిన నేపథ్యంలో Paytm షేర్లు సోమవారం కాసింత లాభపడొచ్చు..అంతమాత్రాన దీని వెంటబడి 

కొనుగోలు చేయవద్దు.ఎందుకంటే..ఇది తాత్కాలికంగా కస్టమర్ల వెసులుబాటు కోసం ఆర్బీఐ ఇచ్చిన గడువు తప్ప..మిగిలిన కండిషన్లలో ఎలాంటి తేడా లేదు 



 Paytm QR, సౌండ్‌బాక్స్ , కార్డ్ మెషీన్‌లు మార్చి 15 తర్వాత కూడా  పని చేస్తూనే ఉంటాయి. Paytm ద్వారా డిజిటల్ చెల్లింపులను అంగీకరించే వ్యాపారులు యాక్సిస్ బ్యాంక్ నోడల్ బ్యాంక్‌తో దీన్ని కొనసాగించగలరు. ఈ విషయాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. 


ఆర్‌బిఐ మార్చ్ 15 వరకూ గడువు పెంచడం.. యాక్సిస్ బ్యాంక్ టై-అప్‌ విషయం తెలపడంతో..కంపెనీ స్టాక్ శుక్రవారం 6-సెషన్ల నష్టాల పరంపరను తట్టుకుని 5 శాతం పెరిగి రూ. 341.30 వద్ద ముగిసింది. జనవరి 31 నుంచి ( ఆర్‌బిఐ పేమెంట్స్ బ్యాంక్  కార్యకలాపాలను నిలిపివేయాలని చెప్పిన రోజు)పేటిఎం షేర్ల రేటు ఇప్పటికీ 55 శాతం క్షీణించేఉంది


ఐతే చాలామంది హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లుగత వారంలో ట్రేడింగ్ బెట్‌గా Paytmని భారీగా కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని

బ్రోకర్లే బాహాటంగా చెప్తుండగా..వారి రిస్కీ స్టెప్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి

Comments