లాభంతో ఆరంభం, ఐటిసి టాప్ గెయినర్లలో ఒకటి

 స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని లాభంతో ప్ర్రారంభించాయ్. నిఫ్టీ ఇంట్రాడేలో మరోసారి 22107 దగ్గరకు వచ్చింది. ఆల్ టైమ్ రికార్డ్ కి 20 పాయింట్ల దూరంలో వెనుదిరిగి 22వేల పాయింట్లపైనే ట్రేడవుతోంది.సెన్సెక్స్ కూడా 72675 పాయింట్ల వరకూ లాభపడి తిరిగి వందపాయింట్లను కోల్పోయింది


బ్యాంక్ నిఫ్టీ పావుశాతం లాభంతో, ఐటి ఇండెక్స్ అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయ్


కేపిటల్ గూడ్స్ మినహా అన్ని రంగాలు ఓ అరశాతం వరకూ లాభంతో ఉండగా,కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎఫ్ఎంసిజి రంగాల్లో కాస్త ఎక్కువ పాజిటివిటీ కన్పిస్తోంది


గ్రాసింతో పాటు బజాజ్ ఆటో,బజాజ్ ఫైనాన్స్, అదానీఎంటర్‌ప్రైజెస్, ఐటిసి ఒకటిన్నరశాతం నుంచి రెండున్నరశాతంలాభపడి టాప్5 నిఫ్టీ గెయినర్లుగా ట్రేడవుతుండగా, ఎల్ అండ్ టి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ,టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, విప్రో ముప్పావు నుంచి ఒకటిన్నరశాతం నష్టపోయాయ్

Comments