జిల్ జిల్ జియో...చిల్ అవుతోన్న ట్రేడర్స్

ఇంట్రాడేలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రూ.347 రేటుకు ఎగశాయ్. ఇది నిన్నటి ముగింపుతో పోల్చితే 15శాతం ఎక్కువ. దీంతో సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ 2లక్షల కోట్లను దాటేసింది. 



2లక్షల25వేల కోట్లపై చిలుకు కేపిటలైజేషన్ దక్కించుకుంది

మార్కెట్లలో 2లక్షల కోట్ల M-CAP దాటిన సంస్థలు 39 కాగా, వాటిలో జియో కూడా చేరిపోయింది


జియో క్యు3లో రూ.293కోట్ల లాభం ప్రకటించింది.అలానే వడ్డీ ఆదాయం రూ.269కోట్లుగా తెలిపింది. 

ఇదంతా కూడా 413కోట్ల ఆదాయంపైనే కావడం గమనించాలి. జనవరిలో ఈ సంస్థ బ్లాక్‌రాక్ ఫైనాన్షియల్ మేనే‌జ్‌మెంట్‌తోకలిసి మ్యూచువల్ ఫండ్ వ్యాపారం కోసం సెబీకి అఫ్లై చేసింది. ఆగస్ట్ 21,2023లో జియో మార్కెట్లలో లిస్ట్ కాగా..అప్పటి ఇష్యూ రేటు రూ.250లలో జరగగా..తర్వాతి రోజుల్లో 202కి కూడా పతనం అయింది

ఇప్పుడు ఆరునెలల్లోనే 50శాతం రిటన్స్ ఇచ్చింది








Comments