సోషల్ మీడియా వికృతకోణాలకు ఇదో ఉదాహరణ. రివ్యూయర్లపై రివర్స్ ఎటాక్ చేస్తోన్న ఆస్పత్రి

 రివ్యూలు తమ హాస్పటల్‌కి వ్యతిరేకంగా పెట్టాడంటూ ఓ టెకీపై 

మాటలదాడికిదిగింది ఓ సంస్థ ! అసలు మీ పెళ్లిపై మాకు డౌట్లున్నాయంటూ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది.బెంగళూరులోని ఆత్రేయ హాస్పటల్ ఇలాంటి నిర్వాకానికి పాల్పడింది


సోషల్ మీడియా వికృతకోణాలకు ఇదో ఉదాహరణ.



ఏదైనా సంస్థ గురించి గూగుల్‌లో రివ్యూలు కోరుతుండటం సహజం..అందులో అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వీలైతై సరిదిద్దుకోవాలి లేదంటే లైట్ తీసుకోవాలి. అంతేకానీ ఇలా చేయడం తగదు

ఎందుకంటే..ఈ హాస్పటల్ తమపై రివ్యూలు పెట్టిన వారి ప్రవేట్ ఇన్ఫర్మేషన్‌ కూడా రిప్లైల రూపంలో అందరికీ కన్పించేలా ప్రదర్శిస్తోంది

పైగా ఈ రివ్యూలు రాసినవారు ఫేక్ అని..చెప్తోంది. అంతవరకూ ఓకే కానీ...పేషెంట్ల వివరాలు ఓపెన్‌గా ఇలా పెట్టడం  ఏంటని రెడిట్‌లోని ఓ యూజర్ వాపోయాడు.


కొందరైతే ఈ ఆస్పత్రి డబ్బు దోచుకుంటుందని ఆరోపిస్తే..ప్రతిగా, నువ్ నీ స్కూల్  స్టేజ్ నుంచే దరిద్రపు విద్యార్ధివనుకుంటూ అని ఎగతాళి చేస్తూ రిప్లై పోస్ట్ చేసిందీ ఆస్పత్రి. దీంతో వెంటనే మన నెటిజన్లలోని మంచితనం అర్జంట్‌గా మేలుకుని..ఆస్పత్రిపై ట్రోల్స్ ప్రారంభించారు..

ఇందులో గమనించాల్సింది..ఇలా ట్రోల్స్ చేసే వీరులే..ఇంకోచోట ఇంకోరి గురించి బ్యాడ్‌గా ట్రోల్ చేస్తుంటారు..ఇదే సోషల్ మీడియాలోని  అంటురోగం

Comments