పేటిఎం...చీకట్లో రాయి

 ఉదయం అంచనా వేసినట్లే పేటిఎం స్టాక్ రేటు ఇవాళ ఐదుశాతం లాభపడింది

ఇంట్రాడేలో రూ.358.35 దగ్గర అప్పర్ సర్క్యూట్ లాక్ చేసింది



ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేసేందుకు మార్చి 15వరకూ గడువు ఇచ్చింది. అంతకి ముందు ఈ గడువు ఫిబ్రవరి నెలాఖరు మాత్రమే, మరోవైపు అక్కౌంట్లను యాక్సిస్ బ్యాంక్‌కి తరలిస్తున్నారు. ఇక సౌండ్ బాక్సులు..పేమెంట్స్

కొనసాగుతాయని పేటిఎఁ ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది


మరిప్పుడు ఏ ధీమాతో పేటిఎం షేర్లను కొనుక్కుంటున్నారో జనాలకే తెలియాలి..పెద్ద క్లయింట్లంటే ఐదేళ్లు లేదంటే కనీసం మూడేళ్లైనా ఆగుతారు..వారికి లాభం వచ్చేంతవరకూ వెయిట్ చేయగలరు..చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు ఎందుకు కొంటున్నారు..కంపెనీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రెండు మూడు క్వార్టర్లు కాదు కదా..ఏడాది వరకూ లాభమనే మాటే విన్పించకపోవచ్చు..ఈ కొనుగోళ్లని చీకట్లో రాళ్లని విసరడంతో పోల్చడంలో తప్పేం లేదనుకుంటా..!

Comments