ప్రతాప్ స్నాక్స్‌‌‌పై మోజు పడిన ఐటీసి

ప్రతాప్ స్నాక్స్ స్టాక్ ఈ రోజు మాంఛి ఊపుగా ట్రేడవతోంది.ఇప్పటికే ఈ స్టాక్ 14శాతం ర్యాలీ చేసి రూ.1344.65 రేటుకు చేరింది. ఐటీసి ఇందులో 47శాతం

వాటా కొనడానికి సిద్ధమవడమే అసలు తాలింపు కాగా.. రీజినల్ టేస్ట్‌తో అవధ్ బ్రాండ్‌తో ప్రతాప్ స్నాక్స్ నమ్కీన్స్ అమ్ముతుంటుంది. అంతేకాదు యెల్లో డైమండ్ చిప్స్ పేరుతో చిప్స్ సేల్ చస్తుంది



ఐతే ఐటీసికే స్వయంగా బింగో పేరుతో సూపర్ టేస్టీ స్నాక్స్ ఉండగా..ఇలా ప్రతాప్ స్నాక్స్‌పై మోజు పడటం ఏంటో అర్థం కాదు. దీనివెనుక కేవలం డిస్ట్రిబ్యూషన్, స్ట్రాంగ్ ప్రజెన్సే కారణమైతే..ఐటీసిని మించిన బ్రాండైతే  ప్రతాప్ స్నాక్స్ కానే కాదు

ITC మ్యాడ్ఏంగిల్స్, యుమిటోస్, ట్యాంగల్స్ పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా బాగా ఇష్టపడతారు

దీనికంటే కూడా హల్దీరామ్స్ ప్రొడక్ట్స్ పోర్ట్‌ఫోలియో ఇంకా పెద్దది. ఈ మధ్యనే వచ్చిన బికాజీ ఫుడ్స్ కూడా టేస్ట్ వేస్ట్ అయినా..తన నార్త్ఇండియన్ స్నాక్స్‌ని బాగానే విక్రయిస్తుంటుంది. మన సౌత్‌లో ఈ బికాజీ పప్పులు పెద్దగా ఉడకవు..అయినా కూడా ఐఆర్ సిటిసి..కేటరింగ్ సంస్థలతో టైఅప్ పెట్టుకుని విక్రయాలు జరిపించుకుంటుంది

ఇలాంటి తరుణంలో ఐటీసి..ప్రతాప్ స్నాక్స్‌లో మేజర్ వాటా తీసుకోవడం..కేవలంప్రతాప్ స్నాక్స్‌కి మాత్రమే ప్రయోజనం తప్ప..ఐటీసికి కొత్తగా వచ్చి పడే బ్రాండ్ వేల్యూ కానీ..ప్రొడక్ట్స్ కానీ లేవనే చెప్పాలి


ఈ నేపధ్యంలోనే ఐటీసీ షేరు రూ.407 దగ్గర ఫ్లాట్‌గా ట్రేడవగా, ప్రతాప్ స్నాక్స్ మాత్రం 1300 దగ్గర పదిశాతం లాభంతో ట్రేడవుతోంది

Comments