మార్కెట్లలో ఉత్సాహం, అంతలోనే జావకారింది




స్టాక్ మార్కెట్లు వీక్లీ ఎక్స్‌పైరీ రోజున కొద్దిపాటి లాభంతో ట్రేడవుతున్నాయ్

ఓపెనింగ్‌లో నిఫ్టీ 21906 పాయింట్లకు పెరిగినా..తర్వాత కిందకు జారింది

సెన్సెక్స్ ఈ రోజు కూడా మరోసారి 72వేలపాయింట్లపైకి చేరినట్లే చేరి తిరిగి

71644 పాయింట్ల వరకూ వచ్చింది


మిడ్ క్యాప్,ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్లు కన్పిస్తుండగా, ఆయిల్ అండ్ గ్యాస్ , మెటల్ సెక్టార్లు

గత సెషన్ల నష్టాలనుంచి తేరుకుని దూసుకుపోతున్నాయ్. బ్యాంక్ నిఫ్టీ, ఐటీ సెక్టార్లు

ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయ్


నిన్న రిజల్ట్స్ అద్భుతంగా ఇచ్చిన మహీంద్రా అండ్ మహీంద్రా 4శాతం లాభపడగా

ఓఎన్‌జిసి, బిపిసిఎల్  కోల్ఇండియా, హిందాల్కో రెండు నుంచి మూడుశాతం వరకూ లాభపడ్డాయ్


యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అపోలో హాస్పటల్,ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే ఒకటినుంచి

రెండుశాతం వరకూ నష్టపోయాయ్






Comments