నష్టాల్లో మార్కెట్లు..మెటల్స్ ర్యాలీ కంటిన్యూ

 స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయ్.ఓపెనింగ్‌లో నిఫ్టీ 22094 పాయింట్ల వరకూ పెరిగి 150 పాయింట్ల వరకూ పతనమైంది.దీంతో 22వేల మార్క్ కోల్పోయింది. 

సెన్సెక్స్‌లో సెల్లింగ్ ఎక్కువగా ఉంది. 72724 పాయింట్ల వరకూ పెరిగిన సెన్సెక్స్ 

ఆ తర్వాత వెంటనే 72089 పాయింట్ల వరకూపతనం  అయింది. దాదాపు 535 పాయింట్లు నష్టపోయింది

ఇఁట్రాడేలో 72వేల పాయింట్ల మార్క్ కూడా కోల్పోవచ్చు.

బ్యాంక్ నిఫ్టీ ఒకశాతం పతనం కాగా, ఐటీ ఇండెక్స్ అరశాతం వరకూ లాభపడింది

స్మాల్ అండ్ మిడ్ క్యాప్, కేపిటల్ గూడ్స్ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయ్. కన్జ్యూమర్ డ్యూరబుల్

సెక్టార్ ఒకటిన్నరశాతం నష్టపోగా, హెల్త్ కేర్ అరశాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకశాతం,

పిఎస్ఈ సెక్టార్ ముప్పావుశాతం వరకూ నష్టాల్లో ట్రేడవుతున్నాయ్. మెటల్ సెక్టార్ నిన్నటి ర్యాలీని కంటిన్యూ చేస్తోంది


నిఫ్టీ‌ప్యాక్‌లో ఐషర్ మోటర్స్, హెచ్‌సిఎల్ టెక్, హిందాల్కో, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్ ముప్పావు నుంచి ఒకటి ముప్పావుశాతం వరకూ లాభపడగా, భారతి ఎయిర్‌టెల్, బిపిసిఎల్, గ్రాసిం,టైటన్ కంపెనీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఒకటిన్నర నుంచి మూడున్నరశాతం వరకూ నష్టపోయాయ్

Comments