లాస్ట్ వీక్ ఇలా

 లాస్ట్ వీక్ అంతకి ముందు వారం నష్టాలను మార్కెట్లు దాదాపు పూడ్చుకున్నాయ్

 ఫిబ్రవరి 16తో ముగిసిన వారంలో 1 శాతం కంటే ఎక్కువ ఎగబాకి రికార్డు  స్థాయికి నిఫ్టీ చేరుకుంది

వడ్డీరేట్ల తగ్గింపు సైకిల్ , నికర ఎఫ్‌ఐఐ అవుట్‌ఫ్లో ప్రారంభ సమయంపై అనిశ్చితి ఉన్నప్పటికీ. Q3FY24 రిజల్ట్స్ సానుకూలంగా ఉండటం.., ద్రవ్యోల్బణం తగ్గడం మార్కెట్లకు కలిసి వచ్చాయ్


వారంలో, BSE సెన్సెక్స్ 1.16 శాతం ర్యాలీ చేసి 72,427 వద్దకు చేరుకుంది, మరియు నిఫ్టీ 50 1.19 శాతం జంప్ చేసి 22,041 వద్దకు చేరుకుంది, అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ అర శాతం లాభపడి స్మాల్‌క్యాప్ ఒకశాతం నష్టపోయింది


 చాలా కీలక రంగాలలో (బ్యాంకులు, టెక్నాలజీ,పవర్,ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో సెక్టార్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయ్

డిఐఐలు ఎగబడి కొంటున్నట్లుగా డేటా చెప్తోంది. ఈ నేపథ్యంలో  కొంతమంది నిపుణులు ఇది ముందస్తు ఎన్నికల ర్యాలీకి నాంది కావచ్చని భావించడం ప్రారంభించారు,

ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వేలు దీనికి ఆజ్యం పోశాయనే చెప్పాలి..ఈ సినారియో( నేపథ్యంలో)లో మార్కెట్లు కొత్త వారానికి సిద్ధం అయ్యాయ్


Comments