మార్కెట్లలోవీక్‌నెస్, వెడ్న్‌స్ డే వేలన్‌టైన్ గిఫ్ట్


స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయ్. ఈ రోజు ఓపెనింగ్‌లోనే నిఫ్టీ

నిన్నటి ముగింపుతో పోల్చితే 180 పాయింట్లు నష్టపోయింది. తర్వాత ఓ యాభైపాయింట్లు

రికవర్ అయి 21600 పాయింట్లపైన నడుస్తోంది



సెన్సెక్స్ 71వేల పాయింట్లను కోల్పోయి..70 809 పాయింట్ల లెవల్‌కి చేరింది


బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, ఐటీ ఇండెక్స్ ఏకంగా రెండుశాతం వరకూ నష్టపోయింది

హెల్త్‌కేర్ సెక్టార్ కూడా ఒకశాతం వరకూ పతనం కాగా..మిగిలిన రంగాలు సోసోగా ట్రేడవుతున్నాయ్


బిపిసిఎల్, కోల్ఇండియా,అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఆటో, అపోలో హాస్పటల్ అరశాతం నుంచి రెండుశాతం

వరకూ లాభపడగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్, సిప్లా, ఎల్టీఐ మైండ్‌ట్రీ రెండు నుంచి రెండున్నరశాతం

వరకూ నష్టపోయాయ్

Comments