దంచిపడేస్తోన్న ఏబిబిఇండియా...నెవర్ బిఫోర్ లాభం మరి

 రిజల్ట్స్ దంచికొట్టడంతో..ఏబిబిఇండియా షేర్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇరగదీశాయ్

ఇంట్రాడేలో 10 శాతం లాభపడి రూ.4939.95రేటుకు చేరాయ్. ట్రేడ్ ప్రారంభం కాగానే, 5శాతం పెరిగిన ఏబిబి ఇండియా స్టాక్..ఆ తర్వాత గంటకి మరో ఐ దుశాతం పెరుగుతూ పోయింది.ఈ స్టాక్ 52వీక్స్ హై రేటు రూ.4990 కాగా, ఆ రేటుని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ కన్పిస్తోంది




క్యు3లో రూ.345 కోట్ల లాభం ప్రకటించిన తర్వాతే ఈ జోరు చోటు చేసుకుంది. కంపెనీ చరిత్రలోనే

ఇది బెస్ట్ పెర్ఫామెన్స్‌గా చెప్తున్నారు. క్రితం డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చితే 13శాతం లాభం పెరిగింది. అలానే

రెవెన్యూ 14శాతం పెరిగి రూ.2757కోట్లకి జంప్ చేసింది. ఇక ఆర్డర్ల ఇన్‌టేక్‌లో 35శాతం జంప్‌తో రూ.3147కోట్లుగా

నమోదు కావడంతో..ఈ కౌంటర్ సడన్‍గా ట్రేడర్ల ఫేవరెట్‌గా మారింది. 


స్టోరీ రాస్తుండగానే మరోసారి ఇంట్రాడే హైని సవరించి ఏబిబిఇండియా షేరు రూ.4943.70కి చేరింది. 

Comments